Raghurama పిటిష‌న్‌పై సుప్రీంలో విచార‌ణ‌
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 08:15 IST

Raghurama పిటిష‌న్‌పై సుప్రీంలో విచార‌ణ‌

 

దిల్లీ:  వైకాపా ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిష‌న్ ఈ ఉద‌యం విచార‌ణకు రానుంది. ఈ పిటిష‌న్‌ను అత్యున్న‌త న్యాయ‌స్థానం అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు స్వీక‌రించింది. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల వెకేష‌న్ బెంచ్ దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఉద‌యం 10.30 గంట‌ల‌కు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఏపీ సీఐడీ అధికారులు ఎంపీ ర‌ఘురామ‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ వేయ‌గా.. ఉన్న‌త న్యాయ‌స్థానం కిందికోర్టుకు వెళ్ల‌మ‌ని సూచించింది. కాగా.. జిల్లా కోర్టు ఆయ‌న‌కు 12 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేప‌థ్యంలో ఎంపీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు శ‌నివారం రాత్రి సుప్రీంలో బెయిల్ పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని