close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 17/06/2020 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ బాధను మాటల్లో వర్ణించలేను: రాహుల్‌

న్యూదిల్లీ: సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరులైన భారత జవాన్లకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘మన దేశం కోసం సైనికులు వీరమరణం పొందారు. ఈ బాధను నా మాటల్లో వర్ణించలేను. అమరులైన సైనిక కుటుంబాలకు నా సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో మీతో మేమున్నాం’ అని ట్విట్‌ చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రముఖులు స్పందించారు. అమరులకు నివాళులర్పించారు.

తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో 17 మంది సైనికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ బాహాబాహీలో ఇరు దేశాల సైనికులు రాళ్లతో కొట్టుకున్నారు. చైనా వైపు కూడా భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉంటుందని భారత అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 43 మంది చైనా సైనికులు గాయపడి లేదా చనిపోయి ఉంటారని పేర్కొంటున్నారు. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.