కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాం:పీయూష్‌
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాం:పీయూష్‌

తిరుమల: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా గతేడాది స్వామివారిని దర్శించుకోలేకపోయానన్నారు. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని యావత్‌ ప్రపంచానికి భారత్‌ తన శక్తిని చాటి చెప్పిందన్నారు. విపత్కర సమయంలో భారత్‌ 150 దేశాలకు ఔషధాలు సరఫరా చేసిందని, ప్రస్తుతం 75 దేశాలకు వ్యాక్సిన్‌ను అందిస్తోందని తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మరింతమంది భక్తులు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

అనంతరం పీయూష్‌ గోయల్‌ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోయల్‌ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కేంద్రమంత్రితో పాటు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని