ఉత్తరాంధ్ర జిల్లాలో పలుచోట్ల వర్షం
close

తాజా వార్తలు

Published : 03/04/2021 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్తరాంధ్ర జిల్లాలో పలుచోట్ల వర్షం

విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాలో శనివారం సాయంత్రం పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. విశాఖ నగరంలో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. భారీ గాలుల వల్ల నగరంలో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రహదారులు జలమయమయ్యాయి. గాజువాక, నర్సీపట్నం, గొలుగొండ, అనకాపల్లి, చీడికాడ, కె.కోటపాడు, పాడేరు, విశాఖ మన్యంలో గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్నిరోజులుగా ఎండల తీవ్రత, తీవ్ర ఉక్కపోతతో అలమటిస్తున్న విశాఖ వాసులకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. శ్రీకాకుళం, వీరఘట్టం, ఆముదాలవలస, సీతంపేట, కొత్తూరు, భామిని, పాలకొండ, జలుమూరు, సారవకోట ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. శ్రీకాకుళంలో ఈదురుగాలులు భారీగా వీయడంతో అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సరుబుజ్జిలి మండలం పాలవలసలో పిడుగుపడి ఒకరు మృతి చెందారు. విజయనగరం జిల్లా కొమరాడలో ఈదరుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ప్రధాన రహదారులపై వృక్షాలు నేలకూలాయి. దీంతో స్థానికులు రోడ్లపై పడ్డ చెట్లను తొలగించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని