close

తాజా వార్తలు

Published : 27/01/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్యామిలీ కంటే ఎక్కువ: శాంసన్‌

ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే సీజన్‌లో టైటిల్ సాధించాలని రాజస్థాన్ రాయల్స్‌ పట్టుదలతో ఉంది. దానిలో భాగంగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కరను డైరెక్టెర్ ఆఫ్ క్రికెటర్‌గా నియమించింది. అంతేగాక యువ వికెట్‌కీపర్‌ సంజు శాంసన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో సంజు శాంసన్‌ రాజస్థాన్ జట్టు గురించి మాట్లాడాడు. ఫ్యామిలీ కంటే ఎక్కువని చెప్పాడు. ‘‘రాజస్థాన్‌ రాయల్స్‌కు నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. జట్టులో చేరిన తర్వాత ఎంతో నేర్చుకున్నాను. రాజస్థాన్‌‌ ఫ్యామిలీ కంటే ఎక్కువ’’ అని శాంసన్‌ అన్నాడు.

కాగా, ఇటీవల అన్ని ఫ్రాంఛైజీలు రిటైర్డ్‌, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ తమ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను వదిలేసుకుంది. అతడితో పాటు అంకిత్ రాజ్‌పుత్‌, ఒషేన్‌ ధామస్‌, వరుణ్ ఆరోన్‌, టామ్‌ కరన్‌, అనిరుద్ధ  జోషి, ఆకాశ్‌ సింగ్, శశాంక్ సింగ్‌ను వదులుకుంది. దీంతో 2021 వేలానికి రాజస్థాన్‌ వద్ద రూ.34.85 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా పంజాబ్‌ (రూ.53.2 కోట్లు) వద్ద ఉన్నాయి. ఫిబ్రవరిలో ఐపీఎల్ వేలం జరగనుంది. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

ఇవీ చదవండి

వాళ్లను గుర్తించలేకపోయాం: క్రికెట్ ఆస్ట్రేలియా

రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని