Rajinikanth: యూఎస్‌కి పయనమైన తలైవా
close

తాజా వార్తలు

Published : 19/06/2021 10:32 IST

Rajinikanth: యూఎస్‌కి పయనమైన తలైవా

చెన్నై: అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శనివారం అమెరికా బయలుదేరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆయన యూఎస్‌ వెళ్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సతీమణి లతతో కలిసి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కొన్ని రోజులు రజనీకాంత్‌ అమెరికాలోనే ఉండనున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తలైవా.. ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి ‘అన్నాత్తే’ షూట్‌ పునఃప్రారంభం కానుందట. ఇందులో రజనీకు జంటగా నయనతార సందడి చేయనున్నారు. ఖుష్బూ, మీనా, జగపతిబాబు, కీర్తి సురేశ్‌ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని