Election results: మమతకు రాజ్‌నాథ్‌ అభినందనలు
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 19:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Election results: మమతకు రాజ్‌నాథ్‌ అభినందనలు

దిల్లీ: పూర్తిస్థాయి ఫలితాలు వెలువడడానికి ముందే పశ్చిమ బెంగాల్‌లో భాజపా ఓటమిని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అంగీకరించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. విజయబావుటా ఎగురవేసిన తృణమూల్‌కు అభినందనలు తెలియజేశారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలిచిన సందర్భంగా సీఎం మమతా బెనర్జీకి శుభాకాంక్షలు. మరో దఫా అధికారంలోకి రాబోతున్న ఆమెకు నా అభినందనలు’’ అని ట్విటర్‌ వేదికగా తెలిపారు.

బెంగాల్‌లో అధికార తృణమూల్‌ గెలుపు దాదాపు ఖాయమైంది. ఇప్పటికే 86 స్థానాల్లో గెలుపొందగా.. అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు సమీప ప్రత్యర్థి భాజపా 25 స్థానాల్లో గెలుపొందింది. మరో 56 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు చివరి వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన నందిగ్రామ్‌లో ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీని విజయం వరించింది. భాజపా అభ్యర్థి సువేందు అధికారిపై ఆమె 1200 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని