close

తాజా వార్తలు

బాలికను బెదిరించి అత్యాచారయత్నం!

 

  హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్‌లో కలకలం

అమీన్‌పూర్‌: ఓ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారన్న ప్రచారం గురువారం హైదరాబాద్‌ శివారులోని అమీన్‌పూర్‌ పట్టణంలో కలకలం రేపింది. బాధితురాలు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు స్థానికంగా ఓ నాయకుడి ఇంట్లో కాపలాదారులుగా పనిచేస్తున్నారు.  శ్రీకాకుళంలో ఉండే వారి కుమార్తె(16) 15 రోజుల క్రితం సంక్రాంతి పండగ కోసం ఇక్కడికి వచ్చింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో దుకాణానికి అని చెప్పి బాలిక బయటకు వెళ్లింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నీ నగ్న చిత్రాలు నా వద్ద ఉన్నాయి.. అని బెదిరించి తీసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక మరో ముగ్గురు కారులో వచ్చి నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి బాలికను తీసుకెళ్లారు. అక్కడ నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. వారు ఇంటి యజమానికి విషయం తెలపడంతో ఆయన సంఘటన స్థలం వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లే సరికి బాలిక ఒంటిపై దుస్తులు లేకుండా ఉంది. దాంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి వెళ్లి దుస్తులు తీసుకువచ్చి బాలికకు ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అమీన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం బాలికను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరగలేదని తెలిపారు. వెంటనే మాటమార్చిన బాలిక తనపై అత్యాచారం జరగలేదని, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు తెలిపింది. బాలిక గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వెళ్లడం, వారితో ఐదుగంటల సమయం ఉండటం, ఫోన్‌ ఉన్నప్పటికీ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం, వైద్యుల పరీక్షలో అత్యాచారం జరగలేదని చెప్పటం.. వంటి వివరాలు అనుమానాస్పదంగా ఉండటంతో లోతుగా విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.