నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
close

తాజా వార్తలు

Published : 27/11/2020 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

విజయనగరం : అక్కా.. పాపను ఆడిస్తానంటూ తీసుకెళ్లిన కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ మధ్యలో ఆపేసిన గ్రామానికి చెందిన ఓ యువకుడు (19) పక్కింటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని తన ఇంట్లో ఆడిస్తానంటూ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పాప నానమ్మ తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కడుపునొప్పిగా ఉందంటూ ఏడుస్తుండటంతో తగరపువలస, అక్కడి నుంచి జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అత్యాచారం జరిగిందని గురువారం నిర్ధరించారు. దీనిపై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భోగాపురం ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. డీఎస్పీ త్రినాథరావు, సీఐ శ్రీధర్‌, దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రామకృష్ణ విచారణ జరుపుతున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) జిల్లా అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌ కోరారు. బాధిత బాలికను గురువారం సీడబ్ల్యూసీ సభ్యులు పరామర్శించారు. అనంతరం దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ త్రినాథ్‌ను కలసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటన జిల్లాలో జరగడం దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని