close

తాజా వార్తలు

పుట్టినరోజని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం..నిందితుడి అరెస్టు

పోక్సో కేసు నమోదు

హైదరాబాద్‌: తన పుట్టిన రోజని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం సెక్షన్‌ 4, ఐపీసీ 363, 376(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. అడ్మిన్‌ ఎస్సై కరుణాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. నారాయణగూడకు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. స్నేహితురాలి ద్వారా యాదాద్రి జిల్లా నారాయణపూర్‌ మండలం గంగాముల తండాకు చెందిన కరంటోతు రోహన్‌ (19) పరిచయమయ్యాడు. అతను నగరంలో ఐటీఐ చదువుతున్నాడు. డిసెంబరు 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో తన పుట్టినరోజని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. అర్ధరాత్రి వరకు కూడా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబరు 30 వేకువజామున 4 గంటల ప్రాంతంలో బాధిత బాలిక ఇంటికి చేరింది. ఏమైందని తల్లిదండ్రులు నిలదీయగా బదులివ్వలేదు. ఆమెను భరోసా కేంద్రానికి పోలీసులు పంపించారు. అక్కడి పోలీసులు, కౌన్సిలర్లు మాట్లాడగా అసలు విషయం చెప్పింది. ఇంజాపూర్‌ గ్రామం సాహెబ్‌నగర్‌ (వనస్థలిపురం సమీపం)లోని ఓ గదిలోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఆమె ఫిర్యాదుపై నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో అడ్మిన్‌ ఎస్సై కరుణాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడిని ఇంజాపూర్‌ గ్రామం సాహెబ్‌నగర్‌లో పట్టుకున్నట్లు అడ్మిన్‌ ఎస్సై తెలిపారు. రిమాండ్‌కు తరలించామన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.