హాట్‌ స్పాట్లలో రాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు
close

తాజా వార్తలు

Published : 02/04/2020 13:23 IST

హాట్‌ స్పాట్లలో రాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని తేల్చింది. హజ్రత్‌ నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన సమ్మేళనానికి హాజరైన తబ్లీగీ జమాత్‌ ప్రతినిధుల వల్లనే వైరస్‌ వ్యాప్తి అమాంతం పెరిగినట్లు తేలడంతో వారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరమయింది. ఇప్పటివరకు 6,000 మందిని గుర్తించి, సుమారు 5,000 మందిని క్వారంటైన్‌కు తరలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇవాళ ఉదయం వరకు దేశంలో కేసుల సంఖ్య 1965కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

కొవిడ్-19 హాట్ స్పాట్ లలో రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ లు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి ఆదేశించింది. హాట్ స్పాట్ లుగా పరిగణించిన ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. గొంతు, ముక్కు రంధ్రాల వద్ద ఈ పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షలో పాజిటివ్ వస్తేనే చికిత్సకు పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

నెగిటివ్ వచ్చిన వారు గృహానికి పరిమితం కావాలని వైద్య పరిశోధన మండలి మధ్యంతర సూచనలు జారీ చేసింది. ఐసీఎంఆర్‌ ఇవాళ సాయంత్రం 5గంటలకు జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కొవిడ్ -19 విషయంలో ఇతర సూచనలను టాస్క్‌ఫోర్స్‌ ఆమోదించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని