
తాజా వార్తలు
రష్మిక జిమ్ వీడియో వైరల్..!
‘మీ అంకితభావానికి హ్యాట్సాఫ్’
హైదరాబాద్: అందం, అభినయంతో తెలుగువారిని ఆకట్టుకున్న కథానాయిక రష్మిక. ఆమె ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు జిమ్‌లో తీసుకున్న వీడియోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా ఆమె కసరత్తులు చేస్తున్న ఓ వీడియో తాజాగా బయటికి వచ్చింది. దీన్ని చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దాదాపు నిమిషంపాటు ఆపకుండా నాలుగు రకాల కసరత్తులు చేయడమే దీనికి కారణం. ఈ జిమ్ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘మీ అంకితభావానికి హ్యాట్సాఫ్, సూపర్, మీరు స్ఫూర్తిదాయకం..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు.
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తాజాగా రష్మిక మంచి హిట్ అందుకున్నారు. ఆమె నితిన్‌కు జంటగా నటించిన ‘భీష్మ’ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. కార్తి సరసన కూడా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలోనూ రష్మిక కనిపించనున్నారు.