
తాజా వార్తలు
‘నాగేశ్వరరావు’ కోసం...
హైదరాబాద్: నాగచైతన్య కథానాయకుడిగా పరశురామ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘నాగేశ్వరరావు’ అనే పేరు ప్రచారంలో ఉంది. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్ చేస్తున్న చిత్రమిదే. మరోసారి తన మార్క్ వినోదంతో కూడిన కుటుంబ కథతోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం.
నాయికగా రష్మిక నటించనున్నట్టు తెలిసింది. పరశురామ్ తీసిన ‘గీత గోవిందం’లోనూ రష్మికనే నాయిక. ఈ సినిమా చేయడానికి రష్మిక అంగీకారం తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
Tags :
జిల్లా వార్తలు