రష్మిక.. మాటిస్తున్నా: విజయ్‌దేవరకొండ
close

తాజా వార్తలు

Published : 18/01/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక.. మాటిస్తున్నా: విజయ్‌దేవరకొండ

నటి ట్వీట్‌కు నటుడి రిప్లై

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ మాస్‌ లుక్‌లో కనిపించి సందడి చేశారు. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అనన్య కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈసినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ గురించి నటి రష్మిక స్పందించారు. పోస్టర్‌ సూపర్‌గా ఉందని తెలిపారు.

‘నాకెంతో సంతోషంగా ఉంది. కిల్లర్‌ పోస్టర్‌..! ఈ మాస్టర్‌ పీస్‌ను వెండితెరపై చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. థియేటర్‌లో సినిమా చూసేరోజు డ్యాన్స్‌ చేస్తూ ఈలలు వేస్తాను. నాకెంతో ఇష్టమైన విజయ్‌దేవరకొండ, పూరీ జగన్నాథ్‌, ఛార్మిలకు ఆల్‌ది బెస్ట్‌’ అని రష్మిక ట్వీట్‌ చేసింది. దీంతో ఆమె చేసిన ట్వీట్‌పై స్పందించిన విజయ్‌.. ‘రుషీ.. ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌లోని ఎంతో మంది డ్యాన్స్‌.. కేకలు.. ఈలలు వేస్తారని మాటిస్తున్నా. ఈ విషయం నీకు కూడా తెలుసు ఎందుకంటే నువ్వు కొంత భాగాన్ని చూశావు.’ అని రిప్లై ఇచ్చారు. దీంతో రష్మిక-విజయ్‌ దేవరకొండల అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

ఇదీ చదవండి

#VD10: టైటిల్‌ ప్రకటించిన టీమ్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని