
తాజా వార్తలు
కనులవిందుగా లక్ష్మీనృసింహుడి రథోత్సవం
అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. తొలుత ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి మెరకవీధిలోని రథంపై కొలువు దీర్చారు. అక్కడ ఆలయ అనువంశిక ధర్మకర్త, ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ రావు, సబ్ కలెక్టర్ కౌశిక్, దేవాదాయ శాఖ ఆర్జేసీ భ్రమరాంబ, ఉత్సవాల ప్రత్యేకాధికారి, డీసీ ఎం.జయరాజు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం గోవింద నామస్మరణలతో భక్తులు రథాన్ని లాగారు. అక్కడి నుంచి స్వామివారి సోదరి అయిన గుర్రలక్కమ్మ ఆలయం వరకు రథాన్ని తీసుకెళ్లి, అమ్మవారికి స్వామి తరఫున చీరసారెలు సమర్పించారు. అనంతరం రథాన్ని స్థానికంగా ఉన్న పంచాయతీ వరకు తీసుకొచ్చారు. దీంతో రథోత్సవం ముగిసింది. కాగా, రేపు గజ, పొన్న వాహనాలపై ఊరేగింపు, అన్నపర్వత మహానివేదన జరగనున్నాయి.
ఇవీ చదవండి
Tags :