close

తాజా వార్తలు

Published : 08/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నా పేరు చెప్పుకొని డ్రింక్‌ తాగండి: రవిశాస్త్రి

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చే మీమ్స్‌ను సరదాగా తీసుకుంటానని, వాటి గురించి పెద్దగా ఆలోచించనని టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. నెటిజన్లు సరదా కోసం తనపై అలాంటివి చేస్తారని, వాటిని ఆస్వాదించి ఊరుకుంటానని చెప్పాడు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా శాస్త్రి ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఇదంతా సరదాగా జరిగే ప్రక్రియ. వాళ్లు నవ్వుకోవడానికే అవన్నీ చేస్తారు. నాకు నష్టం కలిగేలా ఉన్నా ఫర్వాలేదు. నాకేమీ ఇబ్బందీ లేదు. నా పేరు చెప్పుకొని ఒక కూల్‌డ్రింక్‌ తాగండి. నా గురించి చేసే మీమ్స్‌తో ప్రజలు కాసేపు నవ్వుకుంటారు. వాటిని ఆస్వాదిస్తారు. అవి నన్నేం బాధ పెట్టవు’ అని పేర్కొన్నాడు.

క్రికెట్‌లో బాగా ఆడుతూ.. విజయాలు సాధిస్తున్నంత కాలం ప్రజలు సంతోషంగా ఉంటారని, ఒకవేళ ఓటములు లేదా వైఫల్యాలు ఎదురైతే అందుకు తగిన విమర్శలు, ప్రతిఫలాలు స్వీకరించాలని టీమ్‌ఇండియా కోచ్‌ అన్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయిన సందర్భంగా తనపై వచ్చిన ఓ సరదా మీమ్‌ను సైతం శాస్త్రి ఆస్వాదించిన సంగతి తెలిసిందే. ఎవరో చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన ఆయన.. ఆ జోక్‌ బాగుందని, తనకు నచ్చిందని ప్రతిస్పందించాడు.

ప్రజల ముఖాల్లో కాస్త నవ్వు తెప్పించడం బాగుందన్నాడు. అయితే, ఆ ఫొటోలో ‘మ్యాచ్‌ అయ్యేంతవరకు తాగకుండా ఉండలేనని, రెండు రోజుల్లోనే ఆటను పూర్తి చేశారా?’ అని అర్థం వచ్చేలా మీమ్‌ రూపొందించడం గమనాహర్హం. కాగా, సందర్భం వచ్చినప్పుడల్లా నెటిజెన్లు రవిశాస్త్రిపై ఈ విధంగానే మీమ్స్‌ చేస్తుంటారు. ఆయనపై మద్యం గురించే ఎక్కువగా ఆటపట్టిస్తుంటారు. అలాంటివి కూడా తనను బాధించవని టీమ్‌ఇండియా కోచ్‌ వివరించాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని