
తాజా వార్తలు
రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ వాయిదా
ఇంటర్నెట్ డెస్క్ : రాయలసీమ ఎత్తిపోతల పనులకు సంబంధించి దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. పనులు జరపొద్దని ఎన్జీటి ఆదేశాలిచ్చినా వాటిని ఉల్లంఘించారంటూ గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఎన్జీటికి సమాధానం ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు వద్ద పేలుళ్లు జరుపుతున్నారని శ్రీనివాస్ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి పనులు చేయటం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరణ ఇచ్చారు.
ఎన్టీటీకి వివరణ ఇవ్వకుండా పనులు చేపట్టడం భావ్యం కాదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణ తయారవుతోందని న్యాయవాది ఎన్జీటికి వివరించారు. త్వరలోనే దీనిపై నివేదిక అందించనున్నట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలో ఎన్జీటి ధర్మాసనం పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. అప్పటిలోపు ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ సమాధానం సరిగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని వివరించింది.
ఇవీ చదవండి..
బైక్ అంబులెన్స్ రూపొందించిన డీఆర్డీవో
రైతుల ర్యాలీకి అనుమతిపై మీదే అధికారం!