మారటోరియం మరో 90 రోజులు 

తాజా వార్తలు

Updated : 22/05/2020 13:10 IST

మారటోరియం మరో 90 రోజులు 

ముంబయి: కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి(40 బేసిస్‌ పాయింట్లు) తగ్గింపు.  రెపో రేటు తగ్గింపును 5-1 ఓట్లతో ఆరుగురు సభ్యుల కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమ వర్గాలకు కొంతమేర ఊరట లభిస్తుంది.

♦   రివర్స్‌ రెపోరేటు 3.35 శాతానికి తగ్గింపు.
ద్రవ్యోల్బణం అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. మున్ముందు ద్రవ్యోల్బణం లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై ఆధారపడి ఉండోచ్చు.
ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగింపు(జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు) 

మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. సిమెంట్‌ ఉత్పత్తిలో 25 శాతం తగ్గింది.

మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17శాతం మేర పడిపోయింది. ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూలేనంత క్షీణత నమోదు చేసింది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఆహార భద్రతకు భరోసా ఏర్పడింది. ‘వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడంతో వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుంది.

కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

♦ ఎగ్జిమ్‌ బ్యాంకుకు ఆర్‌బీఐ నుంచి రూ.15వేల కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌

ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు.

ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు.

 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని