close

తాజా వార్తలు

Published : 08/11/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లీ బర్త్‌డేలో నిమ్మరసం, బాదంపాలు, మజ్జిగ

బెంగళూరు ఇన్‌సైడర్‌ ‘మిస్టర్‌ నాగ్స్‌’ వెల్లడి

బెంగళూరు.. ఎన్నో ఆశలతో ఇండియన్‌ టీ20 లీగులో అడుగుపెట్టింది. అంచనాల భారం లేకుండా తొలిసారి దుబాయ్‌కి వచ్చామని చెప్పింది. తొలి పది మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లు సాధించి దుమ్మురేపింది. ఆపై హఠాత్తుగా ప్రదర్శనలో మార్పు కనిపించింది. చివరి నాలుగు లీగు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే ఆఖరి మ్యాచులో హైదరాబాద్‌ 17.3 ఓవర్ల తర్వాత లక్ష్యం ఛేదించడంతో మెరుగైన రన్‌రేట్‌ వల్ల ప్లేఆఫ్స్‌ చేరుకుంది.

అబుదాబి వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ పోరులో మళ్లీ హైదరాబాద్‌తో తలపడి ఓటమి పాలైంది. కోహ్లీసేన నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 19.4 ఓవర్లకు 6 వికెట్ల తేడాతో ఛేదించి క్వాలిఫయర్‌-2కి అర్హత సాధించింది. బెంగళూరు ఘోరంగా ఓడిపోయి అభిమానుల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే మ్యాచ్‌కు ముందురోజు రాత్రి విరాట్‌ కోహ్లీ పుట్టినరోజు వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనడం వల్లే ఆటగాళ్ల ప్రదర్శన బాగాలేదని విమర్శలు వినిపించాయి. ఇందుకు ఆ జట్టు సమాధానం ఇచ్చింది. ఆర్‌సీబీ ఇన్‌సైడర్‌ ‘మిస్టర్‌ నాగ్స్‌’ పేరడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం జరిగిందో వివరించారు.

కోహ్లీ పుట్టిన రోజు వేడుకల్లో కేవలం నిమ్మరసం, మజ్జిగ, బాదంపాలు మాత్రమే ఇచ్చామని నాగ్స్‌ చెప్పాడు. అలాంటప్పుడు పార్టీ వల్ల ఆటగాళ్లపై ప్రభావం ఎందుకుంటుందని ప్రశ్నించాడు.  ఇక జట్టు ఓటములపై విలేకరులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అడిగించుకొని వాటికి సమాధానాలు ఇచ్చారు. ఆ ఫన్నీ మీడియా సమావేశాన్ని మీరూ చూసేయండి మరి!

-ఇంటర్నెట్‌ డెస్క్‌






Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని