భాజపాతో పొత్తే ఓటమికి కారణం: పోతిన
close

తాజా వార్తలు

Published : 15/03/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపాతో పొత్తే ఓటమికి కారణం: పోతిన

అమరావతి: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఓటమికి భాజపాతో పొత్తే కారణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిగా ఏర్పడ్డం వల్ల మైనార్టీలంతా తమను వ్యతిరేకించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలపై పార్టీ అధిష్ఠానానికి నివేదిక అందిస్తామన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

‘‘ జనసేనకు భాజపా వల్ల విజయవాడలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మేం ఎక్కడికెళ్లినా ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మమ్మల్ని వ్యతిరేకించారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయాం. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డాం. ప్రజా సమస్యలపై పోరాడాం. ఓటమి గెలుపుగా మారడానికి ఐదేళ్లు నిరీక్షించాలి. మా అభ్యర్థులు చేసిన తప్పేంటి. విజయవాడలో ఎక్కడైనా భాజపా మాకు అండగా నిలబడిందా.?కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణం చేసిందా.?జెండా పట్టుకునే మనిషే మాకు కరవైపోయారు. పశ్చిమ నియోజకవర్గంలోని భాజపాకు కీలకమైన స్థానాల్లో గెలపించడానికి మేం పనిచేయలేదా.? వీటన్నింటిపై రెండు రోజుల్లో అధిష్ఠానికి నివేదిస్తా’’ అని పోతిన మహేశ్‌ అన్నారు.

భాజపాతో పొత్తు కొనసాగింపు విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజలైతే భాజపాతో పొత్తును ఒప్పుకోవడం లేదని పోతిన మహేశ్‌ స్పష్టం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని