ఎన్నికల రాష్ట్రాల్లో రూ. 331కోట్లు పట్టివేత 
close

తాజా వార్తలు

Published : 17/03/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికల రాష్ట్రాల్లో రూ. 331కోట్లు పట్టివేత 

దిల్లీ: నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నామినేషన్లు.. హోరాహోరీ ప్రచారాలతో అభ్యర్థులు బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతో పోలింగ్‌ షెడ్యూల్‌ వెలువడిన వెంటనే ఈసీ వ్యయ పరిశీలన ప్రక్రియ చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. అయితే ఈ తనిఖీల్లో రికార్డు స్థాయిలో నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. 

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 331కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను పట్టుకున్నట్లు ఈసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2016లో ఈ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు, వస్తువుల కంటే ఇది ఎక్కువ అని తెలిపింది. అత్యధికంగా తమిళనాడులో రూ. 127.64కోట్ల విలువైన నగదు, వస్తువులను పట్టుకోగా.. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో రూ. 112.59కోట్ల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 

అసెంబ్లీ ఎన్నికల్లో నల్లధనాన్ని నిర్మూలించేందుఉ అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్‌, పుదుచ్చేరిలో 295 మంది ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు ఈసీ ఈ సందర్భంగా తెలిపింది. ఎన్నికల సమయంలో నగదు పంచడం, మద్యం, ఇతర వస్తువులను ఓటర్లకు ఇచ్చి ప్రలోభపెట్టడం చట్ట ప్రకారం నేరమని పేర్కొంది. మార్చి 27 నుంచి నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని