
తాజా వార్తలు
డ్యాన్సర్లతో కలిసి చిందేసిన వైకాపా నాయకులు
భట్టిప్రోలు : గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులతో వైకాపా నాయకులు సందడి చేశారు. వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డ్యాన్సర్లతో పాటు వైకాపా నాయకులు నృత్యాలు చేశారు. రికార్డింగ్ డ్యాన్స్ చూసేందుకు పరిసర గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి..
డీజీపీ వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి: భాజపా
Tags :