ధర్మారెడ్డి ఇంటిపై దాడి: 44మందికి రిమాండ్‌
close

తాజా వార్తలు

Updated : 02/02/2021 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధర్మారెడ్డి ఇంటిపై దాడి: 44మందికి రిమాండ్‌

వరంగల్‌ న్యాయ విభాగం: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో మొత్తం 44 మందిని జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఈనెల 15 వరకు రిమాండ్‌ విధిస్తూ వరంగల్‌ ఆరో అదనపు కోర్టు మెజిస్ట్రేట్‌ కె.కుమారస్వామి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల భాజపా అధ్యక్షులు రావు పద్మారెడ్డి, కొండేటి శ్రీధర్‌ సహా మొత్తం 44 మందిని సోమవారం వరంగల్‌ కేంద్ర కారగారానికి తరలించారు. 

రామమందిరం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణులు ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై కర్రలు, రాళ్లు, కోడి గుడ్లతో దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై సుబేదారి ఎస్సై సాంబమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం 57 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీనిలో భాగంగా 44 మందిని అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పర్చగా, వారికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. మరోవైపు భాజపా నేతలు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లపై మంగళవారం వాదనలు జరగానున్నాయి. ఈ కేసులో ఇంకా 13 మందిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది.

ఇవీ చదవండి..

పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడి

బోయిన్‌పల్లి కేసు: 17 బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని