వైరల్‌గా మారిన జల ప్రళయం వీడియోలు

తాజా వార్తలు

Published : 10/02/2021 18:49 IST

వైరల్‌గా మారిన జల ప్రళయం వీడియోలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వరద ధాటికి కార్మికులు కొట్టుకుపోతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఫిబ్రవరి 7న జోషిమఠ్‌ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలోని తపోవన్‌ జల విద్యుత్కేంద్రంలోకి వరద పోటెత్తింది. బురదతో కూడిన వరద ఉద్ధృతికి ఆ విద్యుత్కేంద్రం కొట్టుకుపోయింది. ఆ సమయంలో అందులో పనిచేస్తున్న కార్మికులు సైతం ఆ వరదలో కొట్టుకుపోయారు. కాగా ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా ఇప్పటివరకు 32 మంది మృతిచెందారు. ఇంకా 170 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది. ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు భారత సైన్యం, ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) రాత్రింబవళ్లు తీవ్రంగా  కృషిచేస్తున్నాయి. ఓ టన్నెల్‌లో 25-35 మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్న సహాయక బృందాలు టన్నెల్‌కు డ్రిల్లింగ్‌ చేసి బాధితులకు ఆక్సిజన్‌ ‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి...

ఆ పరికరంపైనే ‘అణు’మానాలు

జల విలయం: ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని