విజయవాడలో వరద ముంపునకు అడ్డుగోడ! 
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడలో వరద ముంపునకు అడ్డుగోడ! 


విజయవాడ: నగరంలోని కృష్ణలంక దిగువన వరద ముంపు నివారణ కోసం నిర్మించనున్న రిటైనింగ్‌ వాల్‌కు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కృష్ణా నది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారం కోసం కనకదుర్గమ్మవారధి మొదలు కోటినగర్‌ వరకూ సుమారు 1.5 కిలోమీటర్ల పరిధిలో రూ.125 కోట్లతో కృష్ణాకరకట్ట రక్షణగోడ నిర్మించనున్నారు. కృష్ణ లంక, రాణీగారి తోట వద్ద దుర్గావారధి సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని బుధవారం ఉదయం సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ బాలశౌరి తదితరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లను కూడా శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. శిలాఫలకం ఆవిష్కరణ కంటే ముందు సీఎం జగన్‌ నగర కార్పొరేటర్లతో కొద్దిసేపు ముచ్చటించారు.

ఆశా కార్యకర్తల ఆందోళన
రిటైనింగ్‌ వాల్‌ శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జనాభా ప్రాతిపదికన తమను గతంలో నియమించినట్టే నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానించి తమను ఇబ్బంది పెట్టొద్దంటూ వారు నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తలు సీఎంను కలిసి వినతిపత్రం అందించేందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో వారధి వద్ద జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన చేపట్టారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని