
తాజా వార్తలు
భాజపా ఎదగడానికి తెరాసనే కారణం: రేవంత్
హైదరాబాద్: చారిత్రక నగరం హైదరాబాద్ సంస్కృతి, పేరును మారుస్తామని కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... అభివృద్ధి చేయకున్నా ప్రచారం చేసుకోవచ్చని గోబెల్స్ అన్నదమ్ములు మోదీ, అమిత్ షా నిరూపించారని ఎద్దేవా చేశారు.
‘‘చార్మినార్‌కు ఇరువైపులా వేలాది మంది ఉపాధి కోసం వచ్చి స్థిరపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆదయంలో 70శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే సమకూరుతోంది. ముస్లింలలో ఆర్థికంగా వెనుకబడిన వారి వృద్ధికోసం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం సచార్ కమిటీని నియమించింది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడి మైనారిటీలు అనాదిగా ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారు. మద్దతు ఇచ్చే ముందు ఆ పార్టీ ఎవరి ఒడిలో కూర్చున్నదో ఒక్కసారి గమనించండి. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సారి తెరాస మద్దతిస్తోంది. ఆ మద్దతును ఎంఐఎం సహకరిస్తోంది. ఒవైసీ మాటలు విని మైనారిటీలు తెరాసకు ఓటేస్తున్నారు. ఆ ఓట్ల మద్దతు పొంది తెరాస భాజపా ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. తెరాస, ఎంఐఎం రెండూ కలిసి కాంగ్రెస్‌ను బలహీన పరచడం వల్లే భాజపా ఎదుగుతోంది. ఈ ప్రాంతంలో భాజపా ఎదగడానికి ప్రధాన కారణం తెరాసనే. వరదల సందర్భంలో రాని భాజపా నాయకులు ఇప్పుడు మాత్రం క్యూ కడుతున్నారు. అసద్‌పై ప్రేమ ఉంటే ఇంటికి పిలిచి విందు ఇచ్చి షేర్వాణీ కుట్టించండి ..కానీ ఓటు వేయవద్దు’’ అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
