close

తాజా వార్తలు

Published : 28/11/2020 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తా: రేవంత్‌

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనపై స్థానిక ఎంపీనైన తనకు ఆహ్వానం కానీ, సమాచారం కానీ లేకపోవడం శోచనీయమని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ప్రధాని పర్యటన వ్యక్తిగతం కాదు. భాజపా సొంత కార్యక్రమం అంతకంటే కాదు. ఇది ప్రజాప్రతినిధిని తీవ్రంగా అవమానించడమే. ఇది ప్రొటోకాల్‌ ఉల్లంఘన, సంప్రదాయాలకు విరుద్ధం. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తా.. నా నిరసన తెలియజేస్తా. లోక్‌సభ సమావేశాల్లో  కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతా’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు.


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని