ఊబకాయానికి విప్లవాత్మక ఔషధం! 
close

తాజా వార్తలు

Updated : 12/02/2021 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊబకాయానికి విప్లవాత్మక ఔషధం! 

లండన్‌: ఊబకాయం ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడే కీలక ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారీ స్థాయి అంతర్జాతీయ ప్రయోగాల్లో దీని సామర్థ్యం రుజువైంది. కొవిడ్‌-19 వంటి వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను నిర్వహించారు. ఇందులో 16 దేశాలకు చెందిన దాదాపు 2వేల మంది పాల్గొన్నారు. సెమాగ్లుటైడ్‌ అనే ఈ ఔషధం.. మెదడులో ఆకలికి సంబంధించిన వ్యవస్థను హైజాక్‌ చేస్తుంది. తద్వారా ఆకలి తగ్గి, శరీరంలో చాలా పరిమితంగా కేలరీలు వచ్చి చేరుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

 ప్రయోగాల్లో భాగంగా ఈ కొత్త ఔషధాన్ని పొందినవారిలో మూడో వంతు మంది తమ శరీరంలో దాదాపు ఐదో వంతు బరువును తగ్గించుకోగలిగారు. మూడొంతుల మందిలో 10 శాతం మేర బరువు తగ్గిందని పరిశోధనకు నేతృత్వం వహించిన రేచల్‌ బాటర్‌హామ్‌ చెప్పారు. ఈ స్థాయిలో బరువును తగ్గించే సామర్థ్యం ఏ ఔషధానికీ లేదన్నారు. ఇది చాలా విప్లవాత్మకమైందని చెప్పారు. ప్రయోగంలో పాల్గొన్నవారికి సరాసరిన 15.3 కిలోల మేర బరువు తగ్గిందని తెలిపారు. దీనివల్ల వారికి గుండె జబ్బు, మధుమేహానికి సంబంధించిన ముప్పు అంశాలైన రక్తంలోని కొవ్వు, బ్లడ్‌ షుగర్, రక్త పోటు వంటివి తగ్గాయని చెప్పారు.

ఇవీ చదవండి..

యాపిల్ వాచ్‌తో కొవిడ్-19 లక్షణాల గుర్తింపు..!

ఊపిరితిత్తులకు పొగ!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని