భారత క్రికెట్‌కు అతడు గొప్ప ఆస్తి: గంభీర్‌
close

తాజా వార్తలు

Published : 15/02/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత క్రికెట్‌కు అతడు గొప్ప ఆస్తి: గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ను మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ కొనియాడాడు. భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి పంత్ అని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ (58*; 77 బంతుల్లో, 7×4, 3×6) అజేయ అర్ధశతకం సాధించిన సంగతి తెలిసిందే. అంతేగాక రెండు అద్భుతమైన క్యాచ్‌లతో ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్‌ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.

‘‘పంత్ ఎంతో విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో నమ్మకంతో చేసే ప్రదర్శన ఫలితం వికెట్‌కీపింగ్‌లోనూ ప్రతిబింబిస్తుంది. చెపాక్‌ వికెట్‌‌పై అశ్విన్‌, అక్షర్‌ బౌలింగ్‌కు వికెట్ కీపింగ్ చేయడం కఠినతరమే. అయినా పంత్ చక్కగా వికెట్‌కీపింగ్ చేశాడు. అతడు కీపింగ్‌లో ఎంతో మెరుగవుతున్నాడు. ఇలానే పరుగులు సాధిస్తూ.. వికెట్‌కీపింగ్‌లో మరింత మెరుగైతే టీమిండియాకు గొప్ప ప్యాకేజ్‌లా మారతాడు’’ అని గంభీర్ అన్నాడు.

‘‘ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పంత్‌లా మ్యాచ్‌ ఫలితాన్నే మార్చే సామర్థ్యం ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎక్కువ మందికి లేదు. టెస్టుల్లో పంత్‌ తన ప్రదర్శన ఇలానే కొనసాగిస్తే అతడు భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి అవుతాడు. అయితే ఇంగ్లాండ్‌ వికెట్‌కీపర్‌‌ బట్లర్‌కు కూడా సామర్థ్యం ఉంది. అతడికి బ్యాటింగ్, వికెట్‌కీపింగ్‌లో మంచి నైపుణ్యాలు ఉన్నాయి’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. కాగా, ఆదివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్‌పై భారత్‌ 249 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 329 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 134 పరుగులకే ఆలౌటైంది.

ఇవీ చదవండి

అ‘స్పిన్’‌ ఉచ్చులో ఇంగ్లాండ్‌ విలవిల 

అశ్విన్‌ రికార్డుల పరంపర


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని