అర్ధరాత్రి ఇద్దరు యువకుల దుర్మరణం
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్ధరాత్రి ఇద్దరు యువకుల దుర్మరణం

హైదరాబాద్‌: మలక్‌పేట గంజ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అర్ధరాత్రి ఇద్దరు యువకులు దిల్‌సుఖ్‌నగర్‌ వైపు బైక్‌పై వెళ్తుండగా ఆటోను తాకారు. ఈక్రమంలో బైక్‌ అదుపుతప్పి ఇద్దరు యువకులు అటుగా వస్తున్న లారీ వెనుకచక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని మలక్‌పేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని