ట్రాక్టర్‌-టిప్పర్‌ ఢీ: 18మందికి గాయాలు
close

తాజా వార్తలు

Published : 10/04/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రాక్టర్‌-టిప్పర్‌ ఢీ: 18మందికి గాయాలు

ముగ్గురి పరిస్థితి విషమం

గజ్వేల్: ట్రాక్టర్‌ను ఢీకొని టిప్పర్ బోల్తా పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణ శివారులో చోటు చేసుకుంది. మొత్తం 21 మంది కూలీలు టిప్పర్‌లో ప్రయాణిస్తుండగా వారిలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మల్లన్నసాగర్ దాసారం కాలువలో పనులు చేస్తున్న కూలీలు పనులు ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా మహబూబ్‌నగర్‌కు చెందిన కూలీలు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని