close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120022417 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => Q4tJPHcvDjU [video_short_link] => Q4tJPHcvDjU [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-16 13:44:40.591378 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

కరీంనగర్‌లో ఘోర ప్రమాదం..

కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై నుంచి కారును పరిశీలిస్తున్న క్రమంలో కిందపడి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ మృతి చెందారు. మృతుడు శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ వాసిగా గుర్తించారు. ఉప్పరి మల్యాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బాధితులు కరీంనగర్‌ నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. ఈ ఘటనతో హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.