కర్ణాటకలో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 06/03/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్ణాటకలో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై జరిగిన  దుర్ఘటనలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. బైలాదాకెరే వద్ద  ఓ కారు అదుపుతప్పి అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అదే సమయంలో వేగంగా వస్తున్న మరో కారు బోల్తాపడిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనతో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని