అతివేగానికి ముగ్గురి బలి
close

తాజా వార్తలు

Updated : 21/03/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతివేగానికి ముగ్గురి బలి

విశాఖ జిల్లా మాకవరపాలెం సమీపంలోని పిపి ఆగ్రహారం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పదోతరగతి విద్యార్థులు మృతి చెందారు. మాకవరపాలెంనకు చెందిన ఆర్‌.హేమంత్‌ అనే విద్యార్థి ఇంట్లో శుభకార్యం నిమిత్తం తన స్నేహితులు అవినాష్‌, హర్షిత్‌తో కలిసి వీరు ద్విచక్రవాహనంపై శనివారం అర్ధరాత్రి పయనమయ్యారు.
 పిపి అగ్రహారం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వీరు పయనిస్తున్న ద్విచక్రవాహనం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన అనీష్‌, హర్షిత్‌ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని