డివైడర్‌ను ఢీకొన్న బస్సు: 25 మందికి గాయాలు
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 08:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డివైడర్‌ను ఢీకొన్న బస్సు: 25 మందికి గాయాలు

రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువు వద్ద ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళుతున్న కంటెయినర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికుల సాయంతో క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటికి తీశారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు విశాఖ నుంచి విజయవాడ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని