ఉపాధికోసం వెళ్తుంటే కూలీల ఊపిరాగింది
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాధికోసం వెళ్తుంటే కూలీల ఊపిరాగింది

పులివెందుల : కడప జిల్లా ముద్దనూరులో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పులివెందుల మండలం కొత్తపల్లికి చెందిన మహిళా కూలీలు ముద్దనూరులో పనుల కోసం ఈ తెల్లవారుజామున జీపులో బయల్దేరారు. ఈ క్రమంలో వాహనం ముద్దనూరు రోడ్డు ఎంవీఐ కార్యాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అదే సమయంలో ఈ రెండు వాహనాలు.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న మరో మున్సిపాలిటీ  ట్రాక్టర్‌ను ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. 

సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి  చేరుకొని క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. పారిశుద్ధ్య పనులు చేయడానికి వెళ్తూ మృత్యువాతపడిన కూలీలను ఘటనా స్థలంలో చూసిన స్థానికులు విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని