కృష్ణాజిల్లాలో ఘోర ప్రమాదం: ఆరుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 14/03/2021 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణాజిల్లాలో ఘోర ప్రమాదం: ఆరుగురి మృతి


నూజివీడు: కృష్ణా జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరికుప్ప నూర్పిడి కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో  ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడు మండలం లయన్‌తండాకు చెందిన 13 మంది కూలీలు బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో కుప్ప నూర్పిడి పనులకు ఆటోలో వెళ్తుండగా గొల్లపల్లి గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. 
ఈఘటనలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.  క్షతగాత్రులను విజయవాడ, నూజివీడు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఒడిశా రమేశ్‌, బి.నాగరాజు, బాణావతు స్వనా, భూక్యా సోమ్లా, బర్మావత్‌ బేబీ, బాణావతు నాగు మృతి చెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని