టిప్పర్‌ను ఢీకొన్న ఆటో..ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిప్పర్‌ను ఢీకొన్న ఆటో..ముగ్గురి మృతి

గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు వద్ద ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెడన నుంచి గుడ్లవల్లేరుకు కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని