ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు..ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు..ఇద్దరి మృతి

మర్రిపాడు: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొంగూరు కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఇదే సమయంలో ప్రమాదానికి గురైన కారు వెనుక వస్తున్న మరో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని