యూపీలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 30/01/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌-ఆగ్రా రహదారిపై  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. హుసైన్‌పుర్‌లోని కుందర్కి సమీపంలో బస్సు-ట్రక్కు ఓవర్‌టేకింగ్‌ చేసుకుంటూ ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దట్టమైన పొగమంచు ఉండటంతో రహదారిపై ఉన్న ఆ వాహనాలను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా 25 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి...

దిల్లీ పేలుడు.. సీసీటీవీ ఫుటేజీలో అనుమానితులు
అడ్డుగా ఉన్నాడని.. అంతమొందించారు..!

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని