ఒకదాన్ని ఒకటి ఢీకొన్న నాలుగు వాహనాలు
close

తాజా వార్తలు

Published : 17/03/2021 08:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకదాన్ని ఒకటి ఢీకొన్న నాలుగు వాహనాలు

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున దెందులూరు సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారిపై వెళుతున్న కారు మరమ్మతులకు గురి కావడంతో దాన్ని తీసుకెళ్లడానికి విజయవాడ నుంచి రికవరీ వ్యాను వచ్చింది. కారును తరలించే సమయంలో నెల్లూరు నుంచి విశాఖ వెళుతున్న ఆర్టీసీ బస్సు కారు ఉన్న ప్రదేశానికి రాగానే ఒక్కసారిగా ఆగింది. దీంతో దాని వెనుక కర్ణాటక నుంచి ఒడిశా వెళుతున్న ప్రైవేటు బస్సు ఆర్టీసి బస్సును వెనుక వైపు నుంచి ఢీకొంది. దాని వెనుక గుజరాత్‌ నుంచి విశాఖ పోర్టుకు వెళుతున్న జీపు ప్రైవేటు బస్సును ఢీకొంది. జీపు వెనుక వస్తున్న మినీ లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న జీపును ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపు, మిని లారీ డ్రైవర్లకు గాయాలు కాగా వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై ఉన్న వాహనాలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని