నెత్తురోడిన రోడ్లు..నలుగురి దుర్మరణం
close

తాజా వార్తలు

Updated : 27/03/2021 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెత్తురోడిన రోడ్లు..నలుగురి దుర్మరణం

విజయనగరం, పెరవలి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉదయం జరిగిన ప్రమాదాలతో రహదారులు నెత్తురోడాయి. రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు దుర్మరణం చెందారు. విజయనగరం ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజపతినగరం నుంచి వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకరు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రమణరాజుగా.. మరొకరు సీతం కళాశాల అధ్యాపకునిగా స్థానికులు గుర్తించారు. బైకు ఢీకొట్టిన అనంతరం అదుపుతప్పిన లారీ... రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు వద్ద జరిగిన మరో ప్రమాదంలో దంపతులు చనిపోయారు. తణుకు పట్టణం ఇరగవరం కాలనీకి చెందిన నూలి సతీష్‌, పర్వతవర్ధినీ దంపతులు ద్విచక్రవాహనంపై తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుండగా అన్నవరప్పాడు వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఘటనాస్థలంలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని