కరోనా అంతానికి రోబోల సాయం
close

తాజా వార్తలు

Published : 31/03/2020 01:44 IST

కరోనా అంతానికి రోబోల సాయం

దిల్లీ: రోబోట్స్‌.. కరోనా లాంటి అంటువ్యాధి విజృంభిస్తున్నవేళ ప్రపంచవైద్యలు, శాస్త్రవేత్తల దృష్టి వీటి వినియోగంపై దృష్టి సారించారు. ఆసుపత్రులను శుభ్రపరచడం, కరోనా వైరస్‌ బాధితులకు మందులు, ఆహారాన్ని అందజేయటానికి వీటిని వాడుకోవచ్చు. ప్రస్తుతం భారత్‌లో కూడా వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని కొవిడ్‌-19 అంతం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30వేలకు పైగా మనుషుల ప్రాణాలను కరోనా బలితీసుకుంది. లక్షల్లో బాధితులు ఉన్నారు. ఈ మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లేదు. తయారు చేసేందుకు చాలా సమయం పట్టొచ్చు. మరి ప్రస్తుత పరిస్థితులో దీనిని నివారించలంటే ఒకటే మార్గం భౌతికదూరం పాటించటం. తద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉంటుంది. అలాంటప్పుడు మరి ప్రస్తుతం వైరస్‌తో బాధపడుతున్న వారి పరిస్థితి. వారికి చికిత్స, ఆహారం ఎలా? అందుకే ఈ రోబోట్లు..వాటికి చేసిన ప్రోగ్రామింగ్‌ సహాయంలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారి టెంపరేచర్‌ను పరిశీలించి, చికిత్సచేసి అవసరమైన మందులు అందజేస్తాయి.
ఈ నెల మొదట్లో చైనాలోని వ్యూహన్‌లో ఇందుకు సంబంధించి 14 రోబోట్లను బీజింగ్‌లోని క్లౌడ్‌మైండ్స్‌ సంస్థ ప్రవేశపెట్టింది. అలాగే మనదేశంలో రాజస్థాన్‌లోని ప్రభుత్వాసుపత్రిలో హ్యుమనాయిడ్‌ రోబోలును ప్రవేశపెట్టారు. ఇందువల్ల పారిశుద్ధ్య సిబ్బంది, వైద్యసహాయకులు ప్రత్యక్షంగా కొవిడ్‌-19 బాధితులను తాకకుండా రోబోట్లే చికిత్సను, ఆహారాన్ని అందిస్తున్నాయి. దీంతో వ్యాప్తి తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ప్రతి కరోనా కేంద్రాల్లో హ్యుమనాయిడ్‌ రోబోలను ప్రవేశపెట్టినట్టయితే వైరస్‌ను త్వరగా అంతచేయవచ్చునని దేశంలోని డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు  ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని