వన్డే సిరీస్‌కు రోహిత్‌ దూరం? 
close

తాజా వార్తలు

Updated : 02/03/2021 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వన్డే సిరీస్‌కు రోహిత్‌ దూరం? 

దిల్లీ: ఐపీఎల్‌ 2021కు ఇంకా ఎంతో సమయం లేదు. ఇంకా తేదీలు ప్రకటించలేదు కానీ.. ఏప్రిల్‌ రెండో వారంలో టోర్నమెంట్‌ ఆరంభమయ్యే అవకాశముంది. భారత్‌లోనే  జరుతుందని భావిస్తున్న ఐపీఎల్‌కు ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లందరూ తాజాగా  ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ క్రమంలోనే 2020 ఐపీఎల్‌ (సెప్టెంబరు 19) నుంచి బయో బబుల్‌ ఉంటున్న 10 మంది ఆటగాళ్లలో సాధ్యమైనంత ఎక్కువమందికి విశ్రాంతి ఇవ్వాలని చూస్తోంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇటీవలే జట్టును ప్రకటించారు. బుమ్రాతో పాటు సిరాజ్‌కు ఆ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా విజ్ఞప్తి చేయడంతో చివరి టెస్టు కంటే ముందు నుంచే అతణ్ని బోర్డు జట్టు నుంచి విడుదల చేసింది.

అసలు టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందే బీసీసీఐ.. కావాలంటే విశ్రాంతి తీసుకునే అవకాశం ఆటగాళ్లకు ఇచ్చింది. బయో బబుల్‌లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వచ్చే మానసిక ఇబ్బందుల గురించి అవగాహన కూడా కల్పించింది. ఆటగాళ్లపై భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఇప్పటికే బుమ్రా, సిరాజ్‌లకు ఇంగ్లాండ్‌తో టీ20ల నుంచి విశ్రాంతినిచ్చింది. ఇక ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మతో పాటు సుందర్, పంత్‌లను దూరం పెట్టనున్నట్లు సమాచారం. మార్చి 23, 26, 28వ తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అంతకంటే ముందు 12, 14, 16, 18, 20 తేదీల్లో ఇరు జట్లూ టీ20 మ్యాచ్‌లు ఆడతాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని