భళా.. నీ నైపుణ్యాన్ని మెచ్చితిమి..! 
close

తాజా వార్తలు

Updated : 02/03/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భళా.. నీ నైపుణ్యాన్ని మెచ్చితిమి..! 

సచిన్‌ తెందూల్కర్‌ను ఫిదా చేసిన యువకుడు..

ఇంటర్నెట్‌డెస్క్‌: రూబిక్స్‌ క్యూబ్‌ గురించి అందరికీ తెలిసిందే. అందులోని ఆరు వైపులా ఆరు రంగుల్ని  ఒక వరుసలోకి తెచ్చేందుకు మీలో చాలా మంది ప్రయత్నించే ఉంటారు. కొందరు గంటల తరబడి సమయం తీసుకొని సెట్‌ చేస్తే మరికొందరు నిమిషాల్లో పూర్తి చేస్తారు. అలాంటిది.. ఓ యువకుడు కేవలం 17 క్షణాల్లో రంగుల్ని ఏకం చేసి ఔరా అనిపించాడు. అది కూడా రూబిక్స్‌ను చూడకుండా అన్ని వైపులా రంగుల్ని సరిచేశాడు. ఇది చూసిన క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అతడి ప్రతిభకు ఫిదా అయ్యాడు.

తెందూల్కర్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి ఆ యువకుడి ప్రతిభను అభిమానులతో పంచుకున్నాడు. గజిబిజిగా ఉన్న రూబిక్స్‌ను అతడు ఒకసారి తదేకంగా గమనించి తర్వాత దాన్ని చూడకుండానే 17 సెకన్ల సమయంలో దానిని సెట్‌ చేశాడు. సచిన్‌ దీన్నంతా వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ‘కొద్దిసేపటి క్రితమే ఈ యువకుడిని కలిశాను. మనలో చాలా మంది చూసి కూడా చేయలేని పనిని.. అతడు చూడకుండా చేశాడు. అతని ప్రతిభకు ఆశ్చర్యపోతున్నానంటూ వ్యాఖ్యానించాడు. అలాగే అంత త్వరగా ఎలా చేస్తారనే విషయాన్ని తెలుసుకుంటానని పేర్కొన్నాడు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని