ఎప్పటికీ ఆయనే నా  హీరో: సచిన్‌
close

తాజా వార్తలు

Published : 06/03/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎప్పటికీ ఆయనే నా  హీరో: సచిన్‌

సునీల్‌ గావస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ భారత క్రికెట్‌లో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన ఆరాధ్య క్రికెటర్‌ను గుర్తు చేసుకొంటూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పాడు. 1971 వెస్టిండీస్‌ పర్యటనలో అరంగేట్రం చేసిన సన్నీ తర్వాత మేటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వరుస రికార్డులతో ప్రపంచ క్రికెట్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అలా 16 ఏళ్ల పాటు టీమ్‌ఇండియాకు ఎనలేని సేవలందించిన గావస్కర్‌ 1987లో రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఆపై క్రికెట్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతూ భారత క్రికెట్‌లో తనదైన ముద్రను వేశారు.

ఈ సందర్భంగా సచిన్‌ ఓ ట్వీట్‌ చేస్తూ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ‘50 ఏళ్ల క్రితం ఓ యువకుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. తొలి పర్యటనలోనే 774 పరుగులు చేసి మా తరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. టీమ్‌ఇండియా అప్పుడు వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ జట్లపై విజయం సాధించింది. ఒక్కసారిగా భారత క్రికెట్‌లో పెనుమార్పు సంభవించింది. ఒక యువ క్రికెటర్‌గా నాకంటూ ఆదర్శవంతమైన క్రికెటర్‌ ఉన్నాడని తెలుసుకున్నాను. అతడిలానే నేనూ అవ్వాలనుకున్నా. అతడెప్పటికీ నా హీరోనే. మిస్టర్‌.. గావస్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో మీరు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే 1971 జట్టులోని ప్రతీ ఒక్కరికీ అభినందనలు. మీరంతా మమ్మల్ని గర్వపడేలా చేసి మాకు మార్గనిర్దేశం చేశారు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక బీసీసీఐ సైతం గావస్కర్‌ను ప్రత్యేకంగా సత్కరించింది. క్రికెట్‌ ప్రపంచంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెక్రటరీ జై షా ఓ జ్ఞాపికను అందజేశారు. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడోరోజు భోజన విరామ సమయంలో సన్నీని ఘనంగా సన్మానించారు. ఆ ఫొటోలు, వీడియోలను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని