close

తాజా వార్తలు

Updated : 21/01/2021 19:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే స్వీప్‌ చేస్తాం’

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం: సజ్జల

అమరావతి: పంచాయతీ ఎన్నికల అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం కోసమే ఈ ఎన్నికలను వాయిదా వేయాలని చెబుతున్నామన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే స్వీప్‌ చేస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. 

సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఎత్తిచూపాలని చూస్తున్నారని తెదేపా నేతలను ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలు కనపడనందున సీఎంపై ఉక్రోశంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేయలేదని.. ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై జరిగిన దాడి కేసులో 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇవ్వడానికి పిలిచారని చెప్పారు. నోటీసు ఇచ్చి సంతకం తీసుకుని ఆయన్ను ఇంటికి పంపారన్నారు. 

ఇవీ చదవండి..

జడ్జిలు మారినా న్యాయం మారదు: చంద్రబాబు

ప్రభుత్వ అండతోనే విగ్రహాల ధ్వంసం: కన్నా




Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని