ఆ సంగతి చంద్రబాబుకు తెలియదా?: సజ్జల
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సంగతి చంద్రబాబుకు తెలియదా?: సజ్జల

అమరావతి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా చేపడుతున్న సహాయక చర్యలను పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాలు, దేశాల కంటే రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన స్థానంలో ఉందన్నారు. అధికార యంత్రాంగం, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని.. ఈ మేరకు వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోరాడుతోందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తోందని వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగల ప్రతిపక్షంగా సమీక్ష చేసి లోటు పాట్లు ఎత్తి చూపవచ్చునని.. అంతేకానీ అసత్య ఆరోపణలు చేయడం సరికాదని తెదేపా అధినేత చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

‘‘వాక్సినేషన్ చేయడం లేదు. కరోనా కట్టడి సహా వాక్సినేషన్‌పై కేబినెట్‌లో చర్చించ లేదని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. వాక్సిన్ తయారీ, సరఫరా అంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఆ సంగతి చంద్రబాబుకు తెలియదా? 50 శాతం కేంద్రానికి, మిగిలిన 50 శాతం వ్యాక్సిన్లను కేంద్రం సూచించిన రాష్ట్రాలకు వాక్సిన్ కంపెనీలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో అందరికీ వాక్సిన్ ఎందుకు వేయడం లేదని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వాక్సిన్ సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు.  ఏ దురుద్దేశంతో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలి. అవసరమైతే వాక్సిన్ తయారీ సంస్థలతో చంద్రబాబే మాట్లాడి తెప్పించవచ్చు కదా. వాక్సిన్ కోసం ఎంత వెచ్చించేందుకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉండాలి’’ అని సజ్జల తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని