రెచ్చగొట్టడం పనిగా పెట్టుకున్నారు: సజ్జల
close

తాజా వార్తలు

Published : 02/05/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెచ్చగొట్టడం పనిగా పెట్టుకున్నారు: సజ్జల

అమరావతి: కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. మొదటి వేవ్‌లో కరోనాను సమర్థంగా అధిగమించామన్నారు. ఆ నమ్మకంతోనే స్థానిక ఎన్నికల్లో ప్రజలు వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఓటు ద్వారా చూపించారన్నారు. కొవిడ్ రెండో వేవ్ ప్రమాదకరంగా ఉందన్న ఆందోళన అందరిలోనూ ఉందని సజ్జల తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తే అన్ని వర్గాలు దెబ్బతింటాయని.. దాని వల్ల జరగబోయే నష్టం, మరణాలు ఎక్కువగా ఉంటాయని సీఎం ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. ఆర్థిక కార్యకలాపాలు యథాతథంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. 

చంద్రబాబు ఎక్కడెక్కడో కూర్చుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. విపత్తులు వచ్చినప్పుడు ఎవరూ రాజకీయాలు చేయరని, అందరూ ఒక్కటై ఎదుర్కొంటారని గుర్తుచేశారు. సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మీడియా సహా అందరూ సహకరించాలని కోరారు. ఉద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టడం పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల వల్లే ఈ సమయంలో వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని.. వాళ్ళకి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులు అందరూ కలిసి పని చేయాలని సూచించారు. కొవిడ్ కేర్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని