
తాజా వార్తలు
శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్..
ఇంటర్నెట్ డెస్క్: బడ్జెట్ ఫోన్ శ్రేణిలో తన మార్కెట్ పరిధిని విస్తరించుకునేందుకు శాంసంగ్ కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. కొద్దిరోజుల క్రితం గెలాక్సీ ఎం02ఎస్ మోడల్‌ను విడుదల చేసిన శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఏ02ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో బడ్జెట్ లేదా ఎంట్రీ లెవల్ ఫోన్ కొనాలంటే రెడ్మీ లేదా రియల్మీలవైపే ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. వాటికి పోటీగా శాంసంగ్ ఈ కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టింది. మరి గెలాక్సీ ఏ02లో ఎలాంటి ఫీచర్లున్నాయి..ధరెంత..ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయో చూద్దాం..
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ ఎంటీ6739డబ్ల్యూ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5-అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే ఇస్తున్నారు. మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనక రెండు, ముందు ఒక కెమెరా అమర్చారు. వెనక వైపు 13 ఎంపీ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7.75 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజి, 3జీబీ ర్యామ్/ 32జీబీ, 64జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ థాయ్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడి కరెన్సీలో దీని ధర 2,999 థాయ్ బాత్‌లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 7,000. త్వరలోనే భారత్‌లో వీటి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. డెనిమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, డెనిమ్ గ్రే, డెనిమ్ రెడ్ రంగుల్లో లభిస్తుంది.
ఇవీ చదవండి..